టీమ్ ఇండియాను ఊరిస్తున్న టాప్ ర్యాంకు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజీలాండ్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్నది. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను 2-1తో గెలవడంతో 116 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా రెండో స్థానంలో, ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నది. కాగా, మార్చి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను కోహ్లీ […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజీలాండ్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉన్నది. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను 2-1తో గెలవడంతో 116 రేటింగ్ పాయింట్లతో టీమ్ ఇండియా రెండో స్థానంలో, ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నది.
కాగా, మార్చి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను కోహ్లీ సేన కనీసం 1-0తో గెలిచినా కివీస్‌ను వెనక్కు నెట్టి 119 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలోనే ఇంగ్లాండ్‌లో తలపడుతున్న టీమ్ ఇండియాకు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకోవడం సులభమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సిరీస్ డ్రాగా ముగిసినా లేదా ఓడిపోయినా టీమ్ ఇండియాకు నెంబర్ వన్ ర్యాంకు దక్కడం కష్టమే. మరోవైపు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ రేసులో నిలవాలన్నా ఇంగ్లాండ్‌పై విజయం సాధించడం తప్పనిసరి. దీంతో భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో జరుగనున్న 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 తేడాతో గెలిస్తే 119 పాయింట్లు, 2-0తో అయితే 120 పాయింట్లు, 3-0తో అయితే 122 పాయింట్లు, 4-0తో అయితే 123 పాయింట్లు, 2-1తో అయితే 119 పాయింట్లు, 3-1తో అయితే 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది.
ప్రస్తుతం ఎవరు ఏ ర్యాంకులో?
మొదటి స్థానంలో- న్యూజీలాండ్ 118 రేటింగ్ పాయింట్లు
రెండవ స్థానంలో- ఇండియా 116 రేటింగ్ పాయింట్లు
మూడవ స్థానంలో- ఆస్ట్రేలియా 113 రేటింగ్ పాయింట్లు
నాలుగవ స్థానంలో-ఇంగ్లాండ్ 109 రేటింగ్ పాయింట్లు
ఐదవ స్థానంలో-సౌత్ఆఫ్రికా 96 రేటింగ్ పాయింట్లు
ఆరవ స్థానంలో-శ్రీలంక 83 రేటింగ్ పాయింట్లు
ఏడవ స్థానంలో-పాకిస్తాన్ 82 రేటింగ్ పాయింట్లు
ఎనిమిదవ స్థానంలో-వెస్టిండీస్ 77 రేటింగ్ పాయింట్లు
తొమ్మిదొవ స్థానంలో-బంగ్లాదేశ్ 55 రేటింగ్ పాయింట్లు