ఎగుమతులు తగ్గాయి..దిగుమతులు పెరిగాయి!

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు వరుసగా మూడవ నెల క్షీణించాయి. 2020, డిసెంబర్ నెలకు సంబంధించి 0.8 శాతం తగ్గిన ఎగుమతులు రూ. 1.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా పెట్రోలియం, లెదర్, మెరైన్ ఉత్పత్తులు తగ్గిపోయిన కారణంగా ఎగుమతుల్లో క్షీణత కనిపిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇదే క్రమంలొ దిగుమతులు 7.6 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు పెరిగింది. 2020, ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా దిగుమతులు సానుకూలంగా నమోదయ్యాయి. అయితే, డిసెంబర్ […]

Update: 2021-01-03 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు వరుసగా మూడవ నెల క్షీణించాయి. 2020, డిసెంబర్ నెలకు సంబంధించి 0.8 శాతం తగ్గిన ఎగుమతులు రూ. 1.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా పెట్రోలియం, లెదర్, మెరైన్ ఉత్పత్తులు తగ్గిపోయిన కారణంగా ఎగుమతుల్లో క్షీణత కనిపిస్తోందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇదే క్రమంలొ దిగుమతులు 7.6 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు పెరిగింది. 2020, ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా దిగుమతులు సానుకూలంగా నమోదయ్యాయి. అయితే, డిసెంబర్ నెలలో ఎగుమతులు తగ్గిపోవడం వల్ల వాణిజ్య లోటు 25.78 శాతం పెరిగి రూ. 1.14 లక్షల కోట్లకు చేరుకుంది. జులై నెల తర్వాత అధిక వాణిజ్య లోటు ఇదే కావడం గమనార్హం. 2019, డిసెంబర్ నెలకు పరిశీలిస్తే ఎగుమతులు రూ. 1.9 లక్షల కోట్లుగా ఉండగా, ఎగుమతులు రూ. 2.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే, డిసెంబర్ నెలలో చమురు దిగుమతులు 10.37 శాతం క్షీణించి రూ. 71.1 వేల కోట్లుగా ఉన్నాయి.

ఎగుమతుల్లో ఆయిల్ మీల్స్ భారీగా 192 శాతంపైగా వృద్ధిని నమోదు చేసింది. ఫార్మాస్యూటికల్స్ 17.44 శాతం, సుగంధ ద్రవ్యాలు 17 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 16.44 శాతం, కూరగాయలు, పండ్లు 12.82 శాతం, రసాయనాలు 10.73 శాతం, బియ్యం 8.60 శాతం, రత్నాభరణాలు 6.75 శాత, చేనేత ఉత్పత్తులు 10 శాతం పెరిగాయని వాణిజ్య శాఖ పేర్కొంది. ఇక, లెదర్ 17.7 శాతం, కాఫీ 16.3 శాతం, రెడీమేడ్ దుస్తులు 15 శాతం, పొగాకు 4.9 శాతం ఎగుమతులు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య శాఖ తెలిపింది. అదేవిధంగా, దిగుమతుల్లో పప్పు ధాన్యాలు భారీగా 245 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేయగా, బంగారం 81.8 శాతం, రసాయనాలు 23.3 శాతం, వెజిటెబుల్ ఆయి 43.5 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

Tags:    

Similar News