కులవృత్తులే ఇంపార్టెంట్ : తలసాని
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పశుసంవర్ధక, మత్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆనంతరం పిట్లం చెరువులో లక్షా 74 వేలు, గోసముద్రం చెరువులలో 65 వేల 5 వందల చేపపిల్లలను ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలతో కలిసి చేరువులలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధితో […]
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పశుసంవర్ధక, మత్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆనంతరం పిట్లం చెరువులో లక్షా 74 వేలు, గోసముద్రం చెరువులలో 65 వేల 5 వందల చేపపిల్లలను ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలతో కలిసి చేరువులలో వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధితో పాటు కులవృత్తులకు అధిక ప్రాధాన్యత కలిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, మత్య శాఖ అధికారులు లక్ష్మి నారాయణ, శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ అధికారి అశోక్ కుమార్, మత్య శాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సింలు, ఉపాధ్యక్షులు అంగని దుర్గేష్ తో పాటు సిబ్బంది నరేశ్ తదితరులు ఉన్నారు.