IND vs SA: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సెంచూరియన్‌లో టెస్టు మ్యాచ్ రద్దు
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా అభిమానులు, క్రికెటర్లను ఎంతగానో ఊరిస్తున్న టెస్టు మ్యాచ్(IND vs SA)కు రెండో రోజు వరుణుడు అడ్డుతగిలాడు. ఉదయం నుంచి పూర్తిగా తేమతో కూడిన వాతావరణం ఉండడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత జోరుగా వర్షం పడడంతో రెండో రోజు ఆటను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వార్త విన్న క్రికెట్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనయ్యారు. ఇక ఇదే మ్యాచ్‌పై అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ ‘దురదృష్టవశాత్తూ ఈరోజు సెంచూరియలో భారీ వర్షం కారణంగా ఆట […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా అభిమానులు, క్రికెటర్లను ఎంతగానో ఊరిస్తున్న టెస్టు మ్యాచ్(IND vs SA)కు రెండో రోజు వరుణుడు అడ్డుతగిలాడు. ఉదయం నుంచి పూర్తిగా తేమతో కూడిన వాతావరణం ఉండడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత జోరుగా వర్షం పడడంతో రెండో రోజు ఆటను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వార్త విన్న క్రికెట్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనయ్యారు. ఇక ఇదే మ్యాచ్‌పై అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ ‘దురదృష్టవశాత్తూ ఈరోజు సెంచూరియలో భారీ వర్షం కారణంగా ఆట రద్దు చేయబడింది’ అంటూ చెప్పుకొచ్చింది.
కాగా, డిసెంబర్ 26న సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా ప్రారంభమైన టెస్టు మ్యాచులో.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తన ఆధిపత్యాన్ని చాటింది. డే ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆదిలో మంచి భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే సమయంలో 60 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్ అగర్వాల్ లుంగి ఎంగిడి వేసిన 41ఓవర్‌లో lbwతో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా 117 పరుగుల వద్దనే (0) డకౌట్ అయి నిరాశ పరిచాడు.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన కోహ్లీ.. కాసేపు రాహుల్‌తో జత కట్టాడు. 94 బంతుల్లో 35 పరుగులు చేసిన విరాట్‌ను మళ్లీ లుంగి ఎంగిడి క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో 199 పరుగుల వద్ద టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహనే.. ఆది నుంచి ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్ కాపాడుకున్నారు. కేఎల్ రాహుల్ 248 బంతుల్లో 122 పరుగులు చేయగా.. అజింక్య 81 బంతుల్లో 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక రెండో రోజు టీమిండియా స్కోర్‌పై అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. వరుణుడు రాకతో మ్యాచ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇక రేపటి మ్యాచ్‌పై కూడా వర్షం ప్రభావం ఉన్నట్టు అక్కడి వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.