టీమ్ ఇండియా కోలుకునేనా?
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరాజయం పాలైన ఇండియా ఆదివారం రెండో వన్డే ఆడబోతున్నది. టీమ్ ఇండియా బౌలర్ల వైఫలమ్యే ఓటమి ప్రధాన కారణమని విమర్శకులు చెబుతున్నారు. మహ్మద్ షమీ తప్ప మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆసీస్ జట్టు 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టులో మరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బుమ్రా.. తొలి వన్డేలో పూర్తిగా […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరాజయం పాలైన ఇండియా ఆదివారం రెండో వన్డే ఆడబోతున్నది. టీమ్ ఇండియా బౌలర్ల వైఫలమ్యే ఓటమి ప్రధాన కారణమని విమర్శకులు చెబుతున్నారు. మహ్మద్ షమీ తప్ప మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆసీస్ జట్టు 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత జట్టులో మరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బుమ్రా.. తొలి వన్డేలో పూర్తిగా విఫలమయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసరలేకపోయాడు. చాహల్ తన 10 ఓవర్ల కోటాలో 89 పరుగులు ఇచ్చాడు. ఇది అత్యంత చెత్త ప్రదర్శన.
ఇక నవదీప్ సైనీ గాయం కారణంగా రెండో వన్డేకు అందుబాటులో ఉండక పోవడంతో అతని స్థానంలో నటరాజన్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. అయితే బౌలింగ్‌లో షమీ, బుమ్రాకు తోడుగా నటరాజన్‌ను తీసుకుంటారా లేదా సిరాజ్‌ను తీసుకుంటారా అనే దానిపై సందిగ్దత నెలకొన్నది. ఇక ఆల్‌రౌండర్‌గా జడేజా కూడా ప్రభావం చూపించలేకపోయాడు. మొదటి, రెండో వన్డేకు మధ్య తక్కువ సమయం ఉండటంతో నెట్స్‌లో మరింతగా సాధన చేసే అవకాశం లేకపోయింది. ఇక బ్యాటింగ్‌లో ధావన్, పాండ్యా తమ ఫామ్ కొనసాగిస్తున్నారు. మయాంక్ అగర్వాల్, కోహ్లీ అనవసరమైన షాట్లకు వికెట్లు పారేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తమ ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సి ఉంది. వీటన్నింటినీ అధిగమిస్తే కాని రెండో వన్డేలో ఆస్ట్రేలియాను అడ్డుకోలేరు.