పారిశుధ్య కార్మికులందరికీ పోత్సాహకాలివ్వాలి..
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ -19 విపత్తు సమయంలో అవిశ్రాంతంగా శ్రమిస్తోన్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సీఎం ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందజేయాలని పంచాయతీ వర్కర్స్ యునియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి.నర్సింహన్, మున్సిపల్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19 విపత్తు సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రోత్సాహకం(రూ.5 వేలు) కొంతమందికే చెల్లించారని, మిగిలిన […]
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ -19 విపత్తు సమయంలో అవిశ్రాంతంగా శ్రమిస్తోన్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సీఎం ప్రోత్సాహకంగా రూ.5 వేలు అందజేయాలని పంచాయతీ వర్కర్స్ యునియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి.నర్సింహన్, మున్సిపల్ స్టాఫ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19 విపత్తు సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రోత్సాహకం(రూ.5 వేలు) కొంతమందికే చెల్లించారని, మిగిలిన వారికి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మున్సిపల్ కార్మికులకు కొత్త జీతాలు.. ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపల్ కార్మికులకు ఇప్పటికీ అందలేదన్నారు. వెంటనే కార్మికులకు కొత్త జీతాలు చెల్లించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న సిబ్బందిని జీవో నెం.51 ద్వారా తొలగిస్తామనే కుట్రను ప్రభుత్వం మానుకోవాలని, లేదంటే ఉద్యోగ సిబ్బంది ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Tags : Corona vairus, wokers, Salary, Employees, KCR