మ‌త విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం : ఎస్పీ రంగనాథ్

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా వైరస్ వలన దేశం, రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈలాంటి సమయంలో ఎవరైనా ఇతర మతస్థులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు చేసినా, ఒకరి మతం ఎక్కువ, ఇంకొకరి మతం తక్కువ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా కరోనా నివారణకు పోరాడాలని ఆయన సూచించారు. ఒకరి మనోభావాలను కించ పరిచేలా మత ప్రచారం […]

Update: 2020-04-02 05:47 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా వైరస్ వలన దేశం, రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈలాంటి సమయంలో ఎవరైనా ఇతర మతస్థులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు చేసినా, ఒకరి మతం ఎక్కువ, ఇంకొకరి మతం తక్కువ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా కరోనా నివారణకు పోరాడాలని ఆయన సూచించారు. ఒకరి మనోభావాలను కించ పరిచేలా మత ప్రచారం చేసినా, మతపరమైన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఫార్వార్డ్ చేసినా , మతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే అట్టి వారికి డీటీసీ, నల్లగొండలో కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించి, ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు చేపడుతామ‌ని వెల్ల‌డించారు. కావున జిల్లా ప్రజలంతా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించి ఇబ్బందులు పడవద్దని, ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో సంయ‌మ‌నం పాటించాల‌ని ఎస్పీ కోరారు.

Tags : corona, lockdown, communal clashes, will take serious action, sp ranganath

Tags:    

Similar News