లాక్‌డౌన్ 3.0 : ఏ సేవలకు మినహాయింపులున్నాయి?
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ పలు సేవలకు జోన్‌ల ఆధారంగా మినహాయింపులనిచ్చింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో వేర్వేరుగా మినహాయింపులున్నాయి. అలాగే, జోన్‌లకు అతీతంగా పలుసేవలపై దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలను కొనసాగించనున్నది. మార్చి 25వ తేదీన దేశంలో తొలిసారిగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అటుతర్వాత 19 రోజులపాటు దాన్ని కేంద్రం పొడిగించగా.. తాజాగా మరో రెండు వారాలపాటు పొడిగించింది. మొదటి దశలో ఆంక్షలు కఠినంగా […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ పలు సేవలకు జోన్‌ల ఆధారంగా మినహాయింపులనిచ్చింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో వేర్వేరుగా మినహాయింపులున్నాయి. అలాగే, జోన్‌లకు అతీతంగా పలుసేవలపై దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలను కొనసాగించనున్నది. మార్చి 25వ తేదీన దేశంలో తొలిసారిగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అటుతర్వాత 19 రోజులపాటు దాన్ని కేంద్రం పొడిగించగా.. తాజాగా మరో రెండు వారాలపాటు పొడిగించింది. మొదటి దశలో ఆంక్షలు కఠినంగా ఉండగా.. రెండో దశలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు మినహాయింపులనిచ్చింది. అయితే, లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తేయాలన్న సూచనల నేపథ్యంలో రెండో దశ లాక్‌డౌన్‌కు పలుసేవలకు మినహాయింపులనివ్వగా.. తాజాగా మరికొన్ని సేవలకు కేంద్ర ప్రభుత్వం అవకాశమిచ్చింది.
మూడో దశ లాక్‌డౌన్ కాలంలో కరోనా కేసుల ఆధారంగా ప్రకటించిన జోన్ఏరియాల్లో ఆంక్షల సడలింపులుండనున్నాయి. అధిక కేసులుండే రెడ్ జోన్‌లో కొంచెం కఠిన నిబంధనలుండగా.. ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో చాలా వరకు సడలింపులనిచ్చింది. అవేంటో ఓ సారి చూద్దాం..
లాక్‌డౌన్ 3.0లో సడలింపులు
మూడో దశ లాక్‌డౌన్‌లో రెడ్ జోన్ ఏరియాల్లోనూ కేంద్ర ప్రభుత్వం అనేక సడలింపులనిచ్చింది.
*రెడ్ జోన్‌గా గుర్తించిన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పారిశ్రామిక, నిర్మాణ పనులు, ఉపాధి పనులు సహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇటుక బట్టీలకు అనుమతి ఉన్నది. షాపింగ్ మాల్స్ మినహా అన్ని సరుకులు అమ్మే షాపులకు అవకాశమిచ్చింది.
* వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి ఉన్నది. అన్ని ప్లాంటేషన్ పనులకు, పశుసంపద పనులకూ అవకాశమిచ్చింది.
*అన్ని ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి.
*ఫైనాన్షియల్ సెక్టార్‌కు చాలా వరకు ఊరట లభించనుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ పనులు, పరపతి సహకార సంఘాలకు మినహాయింపులున్నాయి
* నిత్యావసర సేవలు వాటర్, పారిశుధ్య, వేస్ట్ మేనేజ్‌మెంట్, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, పోస్టల్, కొరియర్ సేవలకు అనుమతి ఉన్నది.
* రెడ్ జోన్‌లోనూ అనేక ప్రైవేటు సంస్థలకు అనుమతి ఉన్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ, ఐటీ ఆధార సేవలు, డేటా, కాల్ సెంటర్లకు అవకాశమిచ్చింది.
* స్వయం ఉపాధి చేసుకునేవారికి(నాయి బ్రాహ్మణులు మినహా) అనుమతి ఉన్నది.
*ఫార్మాస్యూటికల్, డ్రగ్స్, అత్యవసర సరుకులు తయారీ యూనిట్లకు మినహాయింపులనిచ్చింది.
* ఆరెంజ్ జోన్‌లలో పైన పేర్కొన్న సేవలతోపాటు ట్యాక్సీ, క్యాబ్‌లకు ఒక్క ప్రయాణికుడితో అనుమతి ఉన్నది.
* వేరే జిల్లాలోకి వెళ్లే అవకాశముంటుంది. కారులలో ఇద్దరు ప్రయాణికులకు, బైక్‌పై ఇద్దరికి అనుమతి.
* గ్రీన్ జోన్‌లలో బస్సులు 50 శాతం సీటింగ్‌తో విధులు నిర్వహించుకోవచ్చు. బస్సు డిపోలు 50శాతం సామర్థ్యంతో పనిచేసుకోవచ్చు.
* ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉంది.
నిషేధాజ్ఞలు..
జోన్‌లకు అతీతంగా దేశవ్యాప్తంగా పలు సేవలపై నిషేధాన్ని కేంద్రం అలాగే కొనసాగించనున్నది. విమానం, రైళ్లు, మెట్రో సేవలపై నిషేధాజ్ఞలు ఎప్పట్లాగే అమలు కానున్నాయి. అలాగే, రాష్ట్రాల మధ్య రవాణాపైనా ఆంక్షలు కొనసాగుతాయి. వీటితోపాటు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్య, శిక్షణ సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాల్స్, జిమ్స్, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి అత్యధిక మంది గుమిగూడే ప్రాంతాలపై నిషేధముంటుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సదస్సులపైనా ఆంక్షలు కొనసాగుతాయి.
TAGS: lockdown, relaxations, exemptions, open, services, ban, MHA, extend