భారత్‌కు రానున్న 4.50 లక్షల రెమిడెసివిర్‌ వయల్స్

న్యూఢిల్లీ: దేశంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్‌ల కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడానికి సంకల్పించి, దిగుమతులను ప్రారంభించింది. 75వేల రెమిడెసివిర్ వయల్స్ నేడు భారత్‌కు చేరబోతున్నట్టు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, ఈజిప్ట్ కంపెనీ ఎవా ఫార్మాల నుంచి దిగుమతి ఒప్పందాన్ని చేసుకుంది. 4.50 లక్షల రెమిడెసివిర్ వయల్స్‌ను ఆర్డర్ చేసింది. వచ్చే […]

Update: 2021-04-30 01:50 GMT

న్యూఢిల్లీ: దేశంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్‌ల కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడానికి సంకల్పించి, దిగుమతులను ప్రారంభించింది. 75వేల రెమిడెసివిర్ వయల్స్ నేడు భారత్‌కు చేరబోతున్నట్టు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, ఈజిప్ట్ కంపెనీ ఎవా ఫార్మాల నుంచి దిగుమతి ఒప్పందాన్ని చేసుకుంది. 4.50 లక్షల రెమిడెసివిర్ వయల్స్‌ను ఆర్డర్ చేసింది.

వచ్చే ఒకటి రెండు రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్‌కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ వెల్లడించింది. ఎవా ఫార్మా తొలుత పది వేల వయల్స్, తర్వాత 15 రోజులకు ఒకసారి 50వేల వయల్స్‌ను జులై వరకు మనదేశానికి పంపిస్తుంది తెలిపింది. దిగుమతులతోపాటు ఇప్పటికే దేశీయంగా ఈ డ్రగ్ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది. మనదేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచుకున్నాయి.

Tags:    

Similar News