లస్సీ తాగిన 115 మందికి అస్వస్థత
దిశ, వెబ్ డెస్క్ : వారాంతపు సంతలో లస్సీ తాగిన 115 మంది ఇందులో 21 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా పోడియా మండలంలోని కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కుర్తి గ్రామంలో ప్రతి వారం శుక్రవారం రోజున వారంతపు సంత జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూలానే సంతకు వెళ్లి వేసవి కదా అని చల్లదనం కోసం లస్సీ తాగారు. దీంతో ఆలస్సీ తాగిన వారికి […]
దిశ, వెబ్ డెస్క్ : వారాంతపు సంతలో లస్సీ తాగిన 115 మంది ఇందులో 21 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా పోడియా మండలంలోని కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కుర్తి గ్రామంలో ప్రతి వారం శుక్రవారం రోజున వారంతపు సంత జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూలానే సంతకు వెళ్లి వేసవి కదా అని చల్లదనం కోసం లస్సీ తాగారు. దీంతో ఆలస్సీ తాగిన వారికి అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో కొంత మంది పరిస్థితి విషమమంగా ఉండడంతో వారిని దగ్గరిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందికి ఇంటి వద్దనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే వారు తీసుకున్న లస్సీ విషపూరితంగా మారడం వల్లే అస్వస్థతకు గురైనట్టు పొడియా వైద్యాధికారి తెలిపారు.