ధాన్యం ఉండగానే ఐకేపీ కేంద్రం ఎత్తివేత.. వర్షానికి తడిసిన రాసులు

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. రైతులు కల్లాలో, ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. రైతులు ధాన్యం రాసులపై పట్టాలు కప్పేలోపు తేలికపాటి వర్షం కాస్త భారీ వర్షంగా మారింది. వర్షంలోనే ధాన్యం రాసుల చుట్టు చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు […]

Update: 2021-05-06 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. రైతులు కల్లాలో, ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. రైతులు ధాన్యం రాసులపై పట్టాలు కప్పేలోపు తేలికపాటి వర్షం కాస్త భారీ వర్షంగా మారింది. వర్షంలోనే ధాన్యం రాసుల చుట్టు చేరిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు రైతులు శ్రమించాల్సి వచ్చింది.

మరో వైపు ఐకేపీ కేంద్రాలలో ధాన్యం ఉండగానే కాపుగల్లులోని కొనుగోలు కేంద్రాన్ని మూడు రోజుల క్రితమే అధికారులు ఎత్తివేశారు. కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని అయినా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మూడు రోజులుగా ఐకేపీ కేంద్రంలో ఎదురుచూస్తున్న తమకు అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News