వరుసగా రెండో నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండో నెలలోనూ సానుకూలంగా నమోదైంది. అక్టోబర్ నెలకు సంబంధించి భారత పారిశ్రామికోత్పత్తి ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 3.6 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో దేశ పారిశ్రామికోత్పత్తి 6.6 శాతం ప్రతికూలంగా నమోదవగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 0.2 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో వరుసగా ఆరు నెలల పాటు పారిశ్రామికోత్పత్తి ఐఐపీ వరుసగా రెండో నెలలో సానుకూలంగా […]

Update: 2020-12-11 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండో నెలలోనూ సానుకూలంగా నమోదైంది. అక్టోబర్ నెలకు సంబంధించి భారత పారిశ్రామికోత్పత్తి ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 3.6 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో దేశ పారిశ్రామికోత్పత్తి 6.6 శాతం ప్రతికూలంగా నమోదవగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 0.2 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో వరుసగా ఆరు నెలల పాటు పారిశ్రామికోత్పత్తి ఐఐపీ వరుసగా రెండో నెలలో సానుకూలంగా నమోదైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 17.5 శాతం ప్రతికూలంగా నమోదవగా, గతేడాది ఈ కాలంలో 0.1 శాతం వృద్ధిని సాధించిందని కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ ఐఐపీలో విద్యుత్, ఉత్పత్తి రంగాలు సానుకూలంగా నమోదయ్యాయి. విద్యుత్ రంగం వార్షిక ప్రాతిపదికన 11.2 శాతం వృద్ధి సాధించగా, తయారీ రంగం 3.5 శాతం పెరిగింది. అయితే, మైనింగ్ 1.5 శాతం తగ్గిందని గణాంకాల శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News