TS Police: రెండు రోజులుగా ఐజీ.. సమీక్ష… పర్యవేక్షణ…

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మరణ మృదంగం కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కార్యరంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనవసరంగా రోడ్లపై తిరిగుతున్న వారిని కట్టడి చేయడంతో పాటు లాక్‌డౌన్ అమలులో జరుగుతున్న లోటు పాట్లను సవరించేందుకు హై లెవల్ ఆఫీసర్స్ పర్యటనలు చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్ లు గురువారం రాత్రి […]

Update: 2021-05-28 04:01 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మరణ మృదంగం కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కార్యరంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనవసరంగా రోడ్లపై తిరిగుతున్న వారిని కట్టడి చేయడంతో పాటు లాక్‌డౌన్ అమలులో జరుగుతున్న లోటు పాట్లను సవరించేందుకు హై లెవల్ ఆఫీసర్స్ పర్యటనలు చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్ లు గురువారం రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ రేంజ్ పరిధిలోని సీపీలు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం అయిన అధికారులు లాక్‌డౌన్ విషయంలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. అయితే సాధారణ పౌరులు రోడ్లపైకి వచ్చినప్పడు వారి ప్రాధాన్యత అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చీటికిమాటికి రోడ్లపైకి వస్తున్న వారిలో సంపూర్ణ అవగాహన కల్పించాలని ఆదేశించారు.

పర్యవేక్షణ…

ఐజీ నాగిరెడ్డి శుక్రవారం కూడా కరీంనగర్, రామగుండం కమిషనరేట్లలో పర్యటించారు. లాక్ డౌన్ అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరిపిన ఆయన పోలీసు బందోబస్తును పరిశీలించారు. కరీంనగర్, పెద్దపల్లి పట్టణాల్లో లాక్ డౌన్ వేలల్లో జనసంచారం తీరుతెన్నులను ప్రత్యక్ష్యంగా గమనించారు. ప్రాక్టికల్ గా ఎదురైన అనుభవాలపై అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News