బంద్‌కు సంపూర్ణ మద్దతు.. IFTU భారీ నిరసన ర్యాలీ
దిశ, ఖమ్మం టౌన్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను అదేవిధంగా కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మార్బుల్ షాప్, ఐరన్ షాపులు, గ్రానైట్ షాపులు నిర్వాహకులు నిరసన ప్రదర్శన చెపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికవర్గం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జి. రామయ్య మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా […]
దిశ, ఖమ్మం టౌన్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను అదేవిధంగా కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మార్బుల్ షాప్, ఐరన్ షాపులు, గ్రానైట్ షాపులు నిర్వాహకులు నిరసన ప్రదర్శన చెపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికవర్గం ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జి. రామయ్య మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లలో పెట్టడం సరైన పద్దతి కాదని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బంద్‌కు సహకరించిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షులు కంకణాల శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ నాయకులు ఉపేందర్ కృష్ణ, శ్రీను, తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.