15 రోజుల్లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్‌ల ఏర్పాటు : ఇఫ్కో
దిశ, వెబ్‌డెస్క్: ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేసేందుకు రానున్న 15 రోజుల్లో సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో నాలుగు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) సోమవారం తెలిపింది. ఈ ప్లాంట్లను గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఏర్పాటు చేయనున్నట్టు ఇఫ్కో వెల్లడించింది. ‘ఇప్పటికే అవసరమైన ఆర్డర్లు అందజేయబడ్డాయి. ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఇఫ్కో వీలైనంత […]
దిశ, వెబ్‌డెస్క్: ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేసేందుకు రానున్న 15 రోజుల్లో సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో నాలుగు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) సోమవారం తెలిపింది. ఈ ప్లాంట్లను గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఏర్పాటు చేయనున్నట్టు ఇఫ్కో వెల్లడించింది. ‘ఇప్పటికే అవసరమైన ఆర్డర్లు అందజేయబడ్డాయి.
ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఇఫ్కో వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుందని’ ఇఫ్కో ప్రతినిధి చెప్పారు. ఈ నాలుగు ప్లాంట్‌ల నిర్మాణానికి సుమారు రూ. 30 కోట్ల పెట్టుబడి పెడుతున్నామన్నారు. ఇఫ్కో ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్‌ను అందజేస్తుంది. ప్రతి సిలిండర్ 46.7 లీటర్లను కలిగి ఉంటుందని ఇఫ్కో మెనేజింగ్ డైరెక్టర్, సీఈఓ యూ ఎస్ అవస్తీ తెలిపారు.