అసెక్సువాలిటీపై అపోహలు.. సెక్స్ చేయడంలో అపార్థాలు..?
దిశ, ఫీచర్స్ : ఎల్‌జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ విషయంలో జనాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ.. చాలా మందికి ‘అలైంగికత్వం(asexuality)’కి అర్థం తెలియడం లేదు. ఈ అంశాన్ని ఎవరికి తోచినట్లుగా వారు ఊహిస్తూ అలైంగిక వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మరి ఈ అనాలోచిత చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే.. అలైంగికత్వానికి అసలు అర్థమేంటో తెలుసుకోవడం ఉత్తమం. ఏ వ్యక్తికైనా ఏ జెండర్ పట్ల లైంగిక ఆకర్షణ లేకపోవడమే ‘అలైంగికత’. సదరు వ్యక్తి ఒకరిపట్ల ఆకర్షితులైనా లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి చూపించడు. అలైంగిక […]
దిశ, ఫీచర్స్ : ఎల్‌జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ విషయంలో జనాల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ.. చాలా మందికి ‘అలైంగికత్వం(asexuality)’కి అర్థం తెలియడం లేదు. ఈ అంశాన్ని ఎవరికి తోచినట్లుగా వారు ఊహిస్తూ అలైంగిక వ్యక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మరి ఈ అనాలోచిత చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే.. అలైంగికత్వానికి అసలు అర్థమేంటో తెలుసుకోవడం ఉత్తమం.
ఏ వ్యక్తికైనా ఏ జెండర్ పట్ల లైంగిక ఆకర్షణ లేకపోవడమే ‘అలైంగికత’. సదరు వ్యక్తి ఒకరిపట్ల ఆకర్షితులైనా లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి చూపించడు. అలైంగిక వ్యక్తులు కొందరు సాధారణ సంబంధాలను కోరుకుంటే.. మరికొందరు మానసిక, భావోద్వేగపూరితంగా ఉంటూనే లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ లైంగిక సంబంధం అంటే.. తమ రొమాంటిక్ భాగస్వామిని సంతోషపెట్టడం లేదా పిల్లల్ని కనేందుకు మాత్రమే సంబంధిత చర్యల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే.. అలైంగికంగా ఉండేందుకు ఒకే మార్గమంటూ లేదు. అలైంగిక వ్యక్తులు ఎలా ఉంటారన్న దానిపై విశ్వవ్యాప్త నిర్వచనమంటూ లేదు.
కొంతమంది మంది అలైంగిక వ్యక్తులు.. ఇతర వ్యక్తుల పట్ల శృంగార భావాలను కలిగి ఉండి వారితో డేటింగ్‌కు వెళ్తారు. దీర్ఘ, స్వల్పకాలిక శృంగార సంబంధాలను కలిగి ఉంటారు. వారు సాధారణంగా సెక్స్ లేదా సెక్స్ వర్ణనలపై విరక్తిని కలిగి ఉండరు. కానీ లైంగిక ఆకర్షణను మాత్రం అనుభవించరు. లైంగికంగా తిరస్కరించబడటం వల్ల ఏ వ్యక్తి అలైంగికంగా మారడు. కొందరు వ్యక్తులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లైంగిక అనుభవాల తర్వాతే వారు అలైంగిక లక్షణాలు కలిగిఉన్నామని తెలుసుకుంటారు. మరికొందరికి చిన్నప్పటి నుంచే శృంగారంపై అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. అందుకే అలైంగికత అనేది మానసిక రుగ్మత కాదు. స్వలింగ సంపర్కం లేదా ద్విలింగ సంపర్కం మాదిరే.. అలైంగికతకు అంతర్లీన కారణమంటూ లేదు. సహజసిద్ధంగా సిద్ధించే లక్షణం కాగా.. జన్యుపరంగానూ శాస్త్రీయత లేదు.
అసెక్సువాలిటీని సొంతంగా ఎలా గుర్తించాలి?
* నా కోణంలో లైంగిక ఆకర్షణ అంటే ఏమిటి?
* నేను లైంగిక ఆకర్షణను అనుభవిస్తున్నానా?
* సెక్స్ భావనపై నా అభిప్రాయమేంటి?
* ఇతరుల ప్రోద్బలంతోనే సెక్స్ పట్ల ఆసక్తి కలుగుతున్నట్లు భావిస్తున్నానా?
* నాకు సెక్స్ ముఖ్యమా?
* నేను ఆకర్షణీయమైన వ్యక్తులను చూస్తున్నానా? వారితో సెక్స్ చేయాల్సిన అవసరం ఉందా?
* అఫెక్షన్ చూపించడాన్ని నేనెలా ఆనందిస్తున్నాను? అందులో సెక్స్ అంశం ఉందా?
ఈ ప్రశ్నలకు ‘సరైన’ లేదా ‘తప్పు’ సమాధానాలు అంటూ లేవు. కానీ అవి మీ లైంగికత గురించి ఆలోచించడంలో సాయపడతాయి.