కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చికెన్‌పై 25% డిస్కౌంట్
దిశ, తెలంగాణ బ్యూరో: సహజంగా ఆషాడమాసం, దసరా, సంక్రాంతి పండగలకు వ్యాపారులు ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టి సెల్స్ పెంచుకుంటారు. కానీ ఓ చికెన్ షాపు యజమాని కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో చికెన్ కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. హైదరాబాద్‌లో పెట్టిన ఈ ఆఫర్‌కు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్‌కు చెందిన సంపత్.. స్థానికంగా రెడ్డి చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయన కుటుంబం తరతరాలుగా […]
దిశ, తెలంగాణ బ్యూరో:
సహజంగా ఆషాడమాసం, దసరా, సంక్రాంతి పండగలకు వ్యాపారులు ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టి సెల్స్ పెంచుకుంటారు. కానీ ఓ చికెన్ షాపు యజమాని కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో చికెన్ కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. హైదరాబాద్‌లో పెట్టిన ఈ ఆఫర్‌కు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్‌కు చెందిన సంపత్.. స్థానికంగా రెడ్డి చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయన కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి. అదే అభిమానంతో చికెన్ కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించాడు. “కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. జీహెచ్ఎంసీని బతికించండి. కిలో చికెన్ తీసుకోండి.. కరోనాను జయించండి. వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కిలో చికెన్ ధరలో 25% రాయితీ ఇస్తా” అంటూ శుక్రవారం ఉదయం ఆఫర్ ప్రకటించాడు.
సుభాష్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువ అభ్యర్ధిని తానం శ్రావణి శ్రీధర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రావణినే ఎన్నుకోవాలని కోరారు. ఆమెకు, ఆమె భర్త శ్రీధర్‌రెడ్డికి డివిజన్ పరిధిలోని గల్లీ గల్లీ పరిచయమేనని.. ఇక్కడి ప్రజల గుండెల్లో వాళ్లు గూడు కట్టుకున్నారని సంపత్ అంటున్నారు. అందుకే శ్రావణి గెలుపే డివిజన్ అభివృద్ధికి మలుపు అవుతుందని వివరించారు. కరోనా కాలం కావడం వల్ల తగినంత దూరం పాటిస్తూ తమ దుకాణానికి వస్తే తొలి వెయ్యి మంది ఓటర్లకు ఈ రాయితీ అందిస్తానని, చికెన్ తిని రోగనిరోధక శక్తి పెంచుకుని కరోనాతో పోరాడాలని కోరారు. దుకాణంలో పెట్టిన ఈ ప్రత్యేక ఆఫర్ కౌంటర్‌ను సుభాష్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి తానం శ్రావణి ప్రారంభించి తొలి ఐదుగురికి కిలో చొప్పున రాయితీ ధరకు చికెన్ అందించారు.