అవసరమైతే ఢిల్లీ లాక్‌డౌన్ : సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మార్నింగ్ వాక్‌లను మానుకొని కొన్నాళ్లు ఇంటి పట్టునే ఉండాలని కోరారు. ఇప్పుడైతే ఢిల్లీలో లాక్‌డౌన్ లేదు కానీ, భవిష్యత్తులో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేసే అవకాశమైతే ఉందని సంకేతాలనిచ్చారు. దీంతో త్వరలోనే ఢిల్లీ లాక్‌డౌన్ అయ్యే అవకాశముందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు: ఢిల్లీలో కరోనావైరస్ బాధితుల సంఖ్య […]

Update: 2020-03-21 05:54 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మార్నింగ్ వాక్‌లను మానుకొని కొన్నాళ్లు ఇంటి పట్టునే ఉండాలని కోరారు. ఇప్పుడైతే ఢిల్లీలో లాక్‌డౌన్ లేదు కానీ, భవిష్యత్తులో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేసే అవకాశమైతే ఉందని సంకేతాలనిచ్చారు. దీంతో త్వరలోనే ఢిల్లీ లాక్‌డౌన్ అయ్యే అవకాశముందని అభిప్రాయాలు వస్తున్నాయి.

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు:

ఢిల్లీలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 26కు చేరడంతో సామాజిక దూరంపై సీఎం కఠిన నిర్ణయం తీసుకున్నారు. 22 మంది విదేశాల నుంచి వచ్చినవారికి వైరస్ సోకగా.. నలుగురికి మాత్రం ఇక్కడే వైరస్ అంటుకున్నది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో అమలులో ఉన్న 50 మందికి మించి గుమిగూడొద్దన్న నిబంధనను సీఎం మరింత కఠినతరం చేశారు. ఈ సంఖ్యను ఐదుగురికే కుదించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరొద్దని సూచించారు.

tags : delhi, cm arvind kejriwal, lockdown, future, cancel, morning walk

Tags:    

Similar News