ప్రైవేటు కాలేజీలకు ‘ఝలక్’
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు ఝలక్ ఇచ్చింది. భద్రత పరమైన సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు కల్పించని కాలేజీ యాజమాన్యాలు మూడు రోజుల్లో స్పందించాలని హైదరాబాద్‌లోని 79ప్రైవేటు కళాశాలలకు ఇంటర్ బోర్డు నోటిసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.ఎవరైనా దీనిపై స్పందించని యెడల ఆయా కాలేజీలను మూసివేస్తామని ఆయన అల్టీమేటం జారీచేశారు. కాగా,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నకాలేజీల మీద ఈనెల 25లోగా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.అందులో […]
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు ఝలక్ ఇచ్చింది. భద్రత పరమైన సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు కల్పించని కాలేజీ యాజమాన్యాలు మూడు రోజుల్లో స్పందించాలని హైదరాబాద్‌లోని 79ప్రైవేటు కళాశాలలకు ఇంటర్ బోర్డు నోటిసులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.ఎవరైనా దీనిపై స్పందించని యెడల ఆయా కాలేజీలను మూసివేస్తామని ఆయన అల్టీమేటం జారీచేశారు. కాగా,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నకాలేజీల మీద ఈనెల 25లోగా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.అందులో భాగంగానే నిబంధనలు పాటించని కాలేజీలకు బోర్డు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.