మాస్క్, శానిటైజర్ల ధరలు ఫిక్స్

కరోనా వైరస్ పుణ్యమా అని ఫేస్ మాస్కులకు, శానిటైజర్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలన్నసామెతను మెడికల్, సూపర్ మార్కెట్ యాజమన్యాలు చక్కగా వంట బట్టించుకున్నాయి. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌లు తీసుకుందామని వెళితే ధరలు సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాటికి నిర్ణీత ధరలు డిసైడ్ చేశారు. మార్కెట్‌లో మాస్క్‌లను రూ.8నుంచి10వరకు మాత్రమే అమ్మాలన్నారు. 20ఎంఎల్ శానిటైజర్ ధరను […]

Update: 2020-03-21 09:03 GMT

కరోనా వైరస్ పుణ్యమా అని ఫేస్ మాస్కులకు, శానిటైజర్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలన్నసామెతను మెడికల్, సూపర్ మార్కెట్ యాజమన్యాలు చక్కగా వంట బట్టించుకున్నాయి. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌లు తీసుకుందామని వెళితే ధరలు సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వాటికి నిర్ణీత ధరలు డిసైడ్ చేశారు. మార్కెట్‌లో మాస్క్‌లను రూ.8నుంచి10వరకు మాత్రమే అమ్మాలన్నారు. 20ఎంఎల్ శానిటైజర్ ధరను రూ.100గా నిర్ణయించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది.

tags ;masks, sanitizers price fix, central govt, medical and super markets

Tags:    

Similar News