వాట్సప్‌లో ఐడియా-వొడా సేవలు

దిశ, న్యూస్‌బ్యూరో : విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో వినియోగదారులకు వీఐసీ సేవలందించేందుకు వొడాఫోన్-ఐడియా శ్రీకారం చుట్టింది. వెబ్‌సైట్స్, మై వొడాఫోన్, మై ఐడియా‌ యాప్‌తో పాటు వాట్సప్‌లో కూడా ఈ సేవలను అందించనుంది. టెలికాం ఇండస్ట్రీలో మొదటిసారిగా ఈ సేవలందిస్తున్న సంస్థగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అంకుర సంస్థ ఓరీసర్వ్‌తో కలిసి వినియోగదారుల సమస్యలను తీర్చడంతో పాటు అవసరమైన సేవలను అందించనుంది. వొడాఫోన్-ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశాంత్ వోరా మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు ఇళ్లకే పరిమితం […]

Update: 2020-05-01 11:16 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో వినియోగదారులకు వీఐసీ సేవలందించేందుకు వొడాఫోన్-ఐడియా శ్రీకారం చుట్టింది. వెబ్‌సైట్స్, మై వొడాఫోన్, మై ఐడియా‌ యాప్‌తో పాటు వాట్సప్‌లో కూడా ఈ సేవలను అందించనుంది. టెలికాం ఇండస్ట్రీలో మొదటిసారిగా ఈ సేవలందిస్తున్న సంస్థగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అంకుర సంస్థ ఓరీసర్వ్‌తో కలిసి వినియోగదారుల సమస్యలను తీర్చడంతో పాటు అవసరమైన సేవలను అందించనుంది. వొడాఫోన్-ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశాంత్ వోరా మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు ఇళ్లకే పరిమితం కావడం వల్ల, ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా, 24 గంటలూ వినియోగించుకునేలా వీఐసీ వర్చువల్ సర్వీసులను అందిస్తున్నామని వివరించారు.

Tags: corona, Lockdown, IDEA,VODAFONE

Tags:    

Similar News