జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉన్నా కరోనా టెస్టు : ఐసీఎంఆర్

న్యూఢిల్లీ : కరోనావైరస్ టెస్టులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త స్ట్రాటజీని రూపొందించుకున్నది. కరోనా హాట్‌స్పాట్‌లు, క్లస్టర్‌లుగా గుర్తించిన ఏరియాల్లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నవారికీ కొవిడ్ 19 టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని అనుసరించేందుకు ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఇప్పటివరకు తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు, శ్వాస అందకపోవడం, తీవ్ర జ్వరం, దగ్గు ఉన్నవారికి ఆస్పత్రుల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే, కరోనా పేషెంట్‌తో నేరుగా కలిసి లక్షణాలు కనిపించకపోయినా వారికి ఈ […]

Update: 2020-04-10 04:18 GMT

న్యూఢిల్లీ : కరోనావైరస్ టెస్టులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త స్ట్రాటజీని రూపొందించుకున్నది. కరోనా హాట్‌స్పాట్‌లు, క్లస్టర్‌లుగా గుర్తించిన ఏరియాల్లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నవారికీ కొవిడ్ 19 టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని అనుసరించేందుకు ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఇప్పటివరకు తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు, శ్వాస అందకపోవడం, తీవ్ర జ్వరం, దగ్గు ఉన్నవారికి ఆస్పత్రుల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే, కరోనా పేషెంట్‌తో నేరుగా కలిసి లక్షణాలు కనిపించకపోయినా వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు, విదేశాల నుంచి వచ్చినవారికి, ల్యాబ్‌లు గుర్తించిన లక్షణాలు కనిపించనివారికీ ఈ టెస్టులు చేస్తున్నారు. ఈ వారంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కొత్త వ్యూహాన్ని అనుసరించనుంది.

Tags: ICMR, tests, new strategy, symptoms, respiratory, illnes

Tags:    

Similar News