ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ ఆదాయం రెట్టింపు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 303 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 302 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు మంగళవారం వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 16,835.36 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 8,209.08 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 303 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 302 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు మంగళవారం వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 16,835.36 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 8,209.08 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ నికర ప్రీమియం ఆదాయం 6.2 శాతం పెరిగి రూ. 8,572 కోట్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గత త్రైమాసికంలో ఏర్పడ్డ క్షీణతలను అధిగమించేందుకు కొత్త బిజినెస్ ప్రీమియం రికవరీ సహాపడినట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పేర్కొంది. ‘ ఈ త్రైమాసికంలో తాము బలమైన పనితీరును కనబరిచాం. ప్రస్తుత పరిస్థితులు కంపెనీకి సానుకూలంగా మారాయి. ఆర్థికవ్యవస్థ క్రమంగా లాక్‌డౌన్ నుంచి బయటపడుతున్న నేపథ్యంలో కంపెనీ సానుకూల పోకడలను చూస్తోందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ సీఈవో ఎన్ ఎస్ కన్నన్ చెప్పారు.