మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ..

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ తాజాగా వెలువరించిన టెస్టు ర్యాంకుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. సిడ్నీ టెస్టు అనంతరం ప్రకటించిన ఈ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న స్మిత్.. సిడ్నీలో వరుసగా 131, 81 పరుగులతో పాయింట్లు సాధించి రెండో స్థానానిక చేరుకున్నాడు. కోహ్లీ తొలి టెస్టు తర్వాత మ్యాచ్ ఆడకపోవడంతో ర్యాంక్ పడిపోయింది. ఇక పాకిస్తాన్‌పై వరుసగా చెలరేగిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అగ్రస్థానాన్ని […]

Update: 2021-01-12 11:27 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ తాజాగా వెలువరించిన టెస్టు ర్యాంకుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. సిడ్నీ టెస్టు అనంతరం ప్రకటించిన ఈ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న స్మిత్.. సిడ్నీలో వరుసగా 131, 81 పరుగులతో పాయింట్లు సాధించి రెండో స్థానానిక చేరుకున్నాడు. కోహ్లీ తొలి టెస్టు తర్వాత మ్యాచ్ ఆడకపోవడంతో ర్యాంక్ పడిపోయింది. ఇక పాకిస్తాన్‌పై వరుసగా చెలరేగిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు మూడో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన రిషబ్ పంత్ ఏకంగా 19 స్థానాలు ఎగబాకి 26వ స్థానానికి చేరుకున్నాడు. అజింక్య రహానే 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్లలో అశ్విన్ 9, బుమ్రా 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా 2వ స్థానానికి చేరుకున్నాడు.

టెస్టు ర్యాంకులు

బ్యాట్స్‌మాన్

1. కేన్ విలియమ్‌సన్ (919)
2. స్టీవ్ స్మిత్ (900)
3. విరాట్ కోహ్లీ (870)
4. మార్నస్ లబుషేన్ (866)
5. బాబర్ ఆజమ్ (781)

బౌలర్లు

1. పాట్ కమ్మిన్స్ (908)
2. స్టువర్ట్ బ్రాడ్ (845)
3. నీల్ వాగ్నర్ (825)
4. టిమ్ సౌథీ (811)
5. జోష్ హాజెల్ వుడ్ (805)

ఆల్‌రౌండర్లు

1. బెన్ స్టోక్స్ (446)
2. రవీంద్ర జడేజా (428)
3. జాసన్ హోల్డర్ (423)
4. షకీబుల్ హసన్ (366)
5. కైల్ జేమిసన్ (293

Tags:    

Similar News