నిరుద్యోగులకు భారీ షాక్.. ఆ పోస్టుల భర్తీకి బ్రేక్..

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు భారీ షాక్ తగిలింది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6వేలకు పైగా క్లర్క్​పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ను IBPS(Institute of Banking Personnel Selection) జారీచేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన ప్రిలిమినరీ, మెయిన్స్​పరీక్షల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఐబీపీఎస్ వెల్లడించింది. తదుపరి వివరాల కోసం తమ వెబ్‌సైట్​(https://www.ibps.in)ను పరిశీలించాల్సిందిగా ఐబీపీస్ అభ్యర్థులను […]

Update: 2021-07-15 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు భారీ షాక్ తగిలింది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6వేలకు పైగా క్లర్క్​పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్‌ను IBPS(Institute of Banking Personnel Selection) జారీచేసింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన ప్రిలిమినరీ, మెయిన్స్​పరీక్షల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఐబీపీఎస్ వెల్లడించింది. తదుపరి వివరాల కోసం తమ వెబ్‌సైట్​(https://www.ibps.in)ను పరిశీలించాల్సిందిగా ఐబీపీస్ అభ్యర్థులను కోరింది.

అయితే, 6వేల క్లర్క్ పోస్టులకు ఆగస్టు చివర్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవలే ఐబీపీఎస్​విడుదల చేసింది. ఇంతలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Tags:    

Similar News