ఐఏఎస్‌ ట్విట్.. వైరల్

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతోంది. అంతేకాదు… అది సందేశాత్మకంగా ఉంది. ఈ విషయం తెలిస్తే కొందరి ఆలోచనలు మారే అవకాశం లేకపోలేదు. విషయమేమిటంటే.. అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్‌ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్‌ సంగ్వాన్‌ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. తన సీబీఎస్‌ఈ ఇంటర్‌ మార్క్స్‌ మెమోను ట్విట్టర్‌ వేదికగా […]

Update: 2020-07-15 01:38 GMT

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరలవుతోంది. అంతేకాదు… అది సందేశాత్మకంగా ఉంది. ఈ విషయం తెలిస్తే కొందరి ఆలోచనలు మారే అవకాశం లేకపోలేదు. విషయమేమిటంటే.. అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్‌ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్‌ సంగ్వాన్‌ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. తన సీబీఎస్‌ఈ ఇంటర్‌ మార్క్స్‌ మెమోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసి ఓ విషయాన్ని అందులో పేర్కొన్నారు. అదేమిటంటే..‘నాకు సీబీఎస్‌ఈ ఇంటర్‌ పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో 24 మార్కులు మాత్రమే వచ్చినయి. ఈ మార్కులు పాస్‌ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ మాత్రమ. అయితే నేను నా జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు మాత్రం నిర్ణయించలేదు. అందుకే మార్కుల కోసం పిల్లలను బాధ పెట్టొద్దు. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. ఫలితాలు అనేటివి ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించాలి’ అని ఆయన అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడది సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. సార్ మీరు బాగా చెప్పారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News