ఆసుపత్రి రూపురేఖలు మార్చిన ఐఏఎస్

దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్‌లోని మోహ్ కంటోన్మెంట్‌లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా 2019లో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అన్షుల్ గుప్తా చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటిలో ఇండియన్ రెడ్ క్రాస్ హాస్పిటల్‌ని బాగు చేయడం ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అంతే.. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఉండి, సేవలు చేయకుండా ఉన్న ఆసుపత్రిని అన్ని రకాల సౌకర్యాలు కలిగిన హాస్పిటల్‌గా దాని రూపురేఖలు మార్చారు. 15 ఏళ్ల నాటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు […]

Update: 2020-02-21 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్:

ఇండోర్‌లోని మోహ్ కంటోన్మెంట్‌లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా 2019లో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అన్షుల్ గుప్తా చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటిలో ఇండియన్ రెడ్ క్రాస్ హాస్పిటల్‌ని బాగు చేయడం ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అంతే.. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఉండి, సేవలు చేయకుండా ఉన్న ఆసుపత్రిని అన్ని రకాల సౌకర్యాలు కలిగిన హాస్పిటల్‌గా దాని రూపురేఖలు మార్చారు.

15 ఏళ్ల నాటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ హాస్పిటల్‌కి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఎక్స్అఫిషియో చైర్మన్ అని తెలియగానే అన్షుల్, దాన్ని బాగు చేసే పనిలో పడ్డారు. పేదలకు ఉచిత వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం వంటి విషయాల్లో ఆయన గొప్ప విజయాన్ని సాధించారు.

ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న అన్షుల్ గుప్తా, మొదటిసారి 2013లో యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ ఉద్యోగంలో చేరారు. ప్రజాసేవే పరమావధిగా అనుకుని మళ్లీ 2016లో సివిల్స్‌లో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. రెడ్ క్రాస్ ఆసుపత్రి విషయంలో ఆయన ముఖ్యంగా సిబ్బంది, బిల్లింగ్, మెడికల్ సౌకర్యాలు వంటి విషయాల మీద ప్రత్యేకంగా దృష్టిసారించి వాటిని చక్కదిద్దడంలో విజయం సాధించారు.

ఏ ఆసుపత్రికైనా అక్కడ పనిచేసే సిబ్బంది వెన్నెముక లాంటివారు. అందుకే ఈ సమస్యను ముందుగా పరిష్కరించాలని అన్షుల్ అనుకున్నారు. సమయానికి రాకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న నర్సులు, డాక్టర్లు, సాంకేతిక సిబ్బందిని తొలగించారు. అంతేకాకుండా లంచానికి మరిగిన వారిని కూడా సస్పెండ్ చేశాడు. సూపరింటెండెంట్ వ్యవస్థను సృష్టించి ఆసుపత్రి వ్యవస్థను చక్కదిద్దారు. కొత్తవారిని తీసుకుని హాస్పిటల్ నిర్మాణ రూపురేఖలను మార్చేశాడు. హాస్పిటల్ మొత్తం సోలార్ లైట్లు అమర్చి విద్యుత్ బిల్లు తగ్గించే ప్రయత్నం చేశాడు. అలాగే బిల్లింగు వద్ద కేవల ఆరు గంటలు మాత్రమే పనిచేస్తున్న ఉద్యోగులను మందలించి, బిల్లులను కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించాడు. తద్వారా హాస్పిటల్ ఆదాయాన్ని పెంచాడు. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా రక్తదాతలను ఏకం చేశాడు. అన్ని రకాల ఆర్థిక స్థితులకు చెందిన వారికి సమాన వైద్యాన్ని అందేలా చేశాడు. మొత్తానికి ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులతో పోటీ పడేలా తయారుచేశాడని అందరూ అన్షుల్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News