‘నా సర్వీసులో ఇలాంటి సీఎంని చూడలేదు’
దిశ ఏపీ బ్యూరో: నా 20 ఏళ్ల సర్వీసులో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేని కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు వ్యాఖ్యానించారు. కరోనాపై ఆంధ్రప్రదేశ్ పోరాటాన్ని వివరిస్తూ సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వారంటైన్‌తో పాటు ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్‌పై రోజుకు అయిదు వందలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కేవలం రాష్ట్రంలోని వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే వారికి […]
దిశ ఏపీ బ్యూరో: నా 20 ఏళ్ల సర్వీసులో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేని కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు వ్యాఖ్యానించారు. కరోనాపై ఆంధ్రప్రదేశ్ పోరాటాన్ని వివరిస్తూ సీఎంపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వారంటైన్‌తో పాటు ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్‌పై రోజుకు అయిదు వందలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కేవలం రాష్ట్రంలోని వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే వారికి పది శాతం మాత్రమే పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పరిధిలో పర్యవేక్షణ చర్యలు చేపట్టామని అన్నారు. రోజూ 13 నుంచి 15 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని ఆయన చెప్పారు. వీరికి తోడు వైజాగ్‌లో రెండు, విజయవాడలో రెండు విమానాలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు గల్ఫ్ నుంచి వచ్చే రాయలసీమ వాసుల కోసం తిరుపతి విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లను కూడా లక్షణాల ప్రాతిపదిన విభజించామని చెప్పారు.
ఏపీలో కోటి రూపాయలతో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 76 కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, తక్కువ స్థాయి కరోనా లక్షణాలు ఉన్నవారిని అక్కడికి తరలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి జిల్లాలో మూడు వేల కొవిడ్ కేర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆ తరువాతి దశలో దీనిని ఐదు వేల సెంటర్లకు పెంచుతామని ఆయన తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ఎక్స్‌రే, అంబులెన్స్, టాయిలెట్ అన్ని సౌకర్యాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలోని 74 కొవిడ్ ఆస్పత్రుల్లో 5874 మంది చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
కొన్ని కొవిడ్ సెంటర్లలో అందించే పౌష్టికాహారంపై ఫిర్యాదులు అందాయని, దీంతో ఐఆర్సీటీసీతో ఆహార సరఫరాలో సమస్యలు అధిగమించే ప్రయత్నంలో ఉన్నామని ఆయన చెప్పారు. వారి సలహాలు తీసుకున్నామని, కొవిడ్‌కి సంబంధించిన అన్ని బిల్లులు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అయితే కొన్నిచోట్ల పెండింగ్ బిల్లులను ఈనెల 15 లోపు పంపిచాలని, జూన్ 30 వరకు ఈ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు.