త్వరలో నా నిర్ణయం వెల్లడిస్తా :రజనీకాంత్

దిశ, వెబ్‎డెస్క్: తమిళ సూపర్ స్టార్ ర‌జనీకాంత్ రాజకీయ అరంగ్రేట వ్యవహారం మరోసారి సస్పెన్స్‌గానే మిగిలింది. రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా రజనీకాంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. కాగా, రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని ఎదురు చూసిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని […]

Update: 2020-11-30 03:02 GMT
త్వరలో నా నిర్ణయం వెల్లడిస్తా :రజనీకాంత్
  • whatsapp icon

దిశ, వెబ్‎డెస్క్: తమిళ సూపర్ స్టార్ ర‌జనీకాంత్ రాజకీయ అరంగ్రేట వ్యవహారం మరోసారి సస్పెన్స్‌గానే మిగిలింది. రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా రజనీకాంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. కాగా, రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని ఎదురు చూసిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.

అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రవేశంపై త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తాను ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా అభిమానులు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షుల ఆలోచనలు, సలహాలు తీసుకున్నాను.. తన సలహాలు కూడా వివరించానని రజనీకాంత్ అన్నారు.

Tags:    

Similar News