14 ఏళ్లప్పుడే నన్ను రేప్ చేసిండు

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నటి జెస్సీ కేవ్ ‘హ్యారీ పాటర్’ మూవీలో నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విషయం తెలిసిందే. అయితే, ఈమెపై లైంగిక దాడి జరిగిందంట. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితురాలితో మాట్లాడుతూ.. ఈ విషయంపై ప్రస్తావించింది. జెస్సీ కేవ్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమెపై తన టెన్నీస్ కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడంట. ఈ […]

Update: 2020-08-30 02:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నటి జెస్సీ కేవ్ ‘హ్యారీ పాటర్’ మూవీలో నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విషయం తెలిసిందే. అయితే, ఈమెపై లైంగిక దాడి జరిగిందంట. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితురాలితో మాట్లాడుతూ.. ఈ విషయంపై ప్రస్తావించింది.

జెస్సీ కేవ్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమెపై తన టెన్నీస్ కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడంట. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ఆ తర్వాత లైంగిక దాడి నుంచి కోలుకునేందుకు చాలా టైం పట్టిందని, మొత్తానికి దాని నుంచి తేరుకోగలిగానని చెప్పుకొచ్చింది. తనలాగే అత్యాచారానికి గురైనవారు చాలామంది ఉన్నారని, వారంతా బాధపడకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని ఆమె భరోసా ఇచ్చింది. కాగా, జెస్సీ కేవ్ ప్రస్తుతం మూడో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకు ఐదేళ్ల కుమారు డోన్నీ, మూడేళ్ల కుమార్తె మార్గోట్ ఉన్నారు.

Tags:    

Similar News