తెరపైనా.. నేనే జీవిస్తా : సోనూసూద్
ఇది బయోపిక్‌ల కాలం.. ఒకరి జీవితం స్ఫూర్తినిచ్చేలా ఉందని తెలిసినా, ఒకరి లైఫ్ క్రైమ్ స్టోరీస్‌తో నిండి ఉందనే ఆలోచన వచ్చినా.. మొత్తానికి సగటు ప్రేక్షకుడికి ట్విస్ట్‌లు, సూపర్ ట్విస్ట్‌లతో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగలదు అనుకుంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి జీవితకథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ముందుకు రాగా.. లాక్‌డౌన్‌లో రియల్ హీరో అయిన రీల్ విలన్ సోనూసూద్ బయోపిక్ తీసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. వలస కూలీలను సొంత […]
ఇది బయోపిక్‌ల కాలం.. ఒకరి జీవితం స్ఫూర్తినిచ్చేలా ఉందని తెలిసినా, ఒకరి లైఫ్ క్రైమ్ స్టోరీస్‌తో నిండి ఉందనే ఆలోచన వచ్చినా.. మొత్తానికి సగటు ప్రేక్షకుడికి ట్విస్ట్‌లు, సూపర్ ట్విస్ట్‌లతో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగలదు అనుకుంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి జీవితకథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ముందుకు రాగా.. లాక్‌డౌన్‌లో రియల్ హీరో అయిన రీల్ విలన్ సోనూసూద్ బయోపిక్ తీసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
వలస కూలీలను సొంత ఖర్చులతో సొంత గూటికి చేర్చిన సోనూ సూద్.. ఈ మధ్యే ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శక, నిర్మాతలు తన బయోపిక్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలియడంతో.. మీ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందని సోనూను ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. తన బయోపిక్‌లో ఎవరో ఎందుకు నటించడం, తానే నటిస్తానని చెప్పాడు. నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి నా కన్నా ఎక్కువగా ఎవరికి తెలియదుగా! అందుకే తన పాత్రలో తానే జీవిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.