కరోనా దెబ్బకు విదేశీ ట్రిప్పులు రద్దు
కరోనా వైరస్ ప్రభావానికి పర్యాటకరంగం కుదేలవుతోంది. రోజురోజుకూ కొత్త దేశాలకు వైరస్ విస్తరిస్తుండటం, బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పర్యాటకులు తమ ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే పెద్ద ఎత్తున బుకింగ్‌లు రద్దయినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. ఇందులో స్వదేశీ పర్యటనలతోపాటు విదేశీ పర్యటనలూ ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మొదట్లో సింగపూర్, థాయిలాండ్, దక్షిణాసియా దేశాల బుకింగ్‌లు రద్దయ్యాయి. అయితే, ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల ట్రిప్పుల రద్దు కూడా ఎక్కువగా ఉన్నట్లు […]
కరోనా వైరస్ ప్రభావానికి పర్యాటకరంగం కుదేలవుతోంది. రోజురోజుకూ కొత్త దేశాలకు వైరస్ విస్తరిస్తుండటం, బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పర్యాటకులు తమ ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే పెద్ద ఎత్తున బుకింగ్‌లు రద్దయినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. ఇందులో స్వదేశీ పర్యటనలతోపాటు విదేశీ పర్యటనలూ ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మొదట్లో సింగపూర్, థాయిలాండ్, దక్షిణాసియా దేశాల బుకింగ్‌లు రద్దయ్యాయి. అయితే, ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల ట్రిప్పుల రద్దు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విమాన ప్రయాణంపై భయాందోళనలు నెలకొన్నాయి. విమానంలో ఒకేసారి 100 మందికిపైగా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విమాన ప్రయాణం అంత సురక్షితం కాదని ప్రయాణికులు భావిస్తున్నారు. అందుకే పర్యటనలను వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.
‘ఈరోజు (బుధవారం) నేను ఇటలీ, లండన్ పర్యటనలను పెద్ద ఎత్తున రద్దు చేశాను. గత కొద్ది రోజుల్లో 80 నుంచి 90 శాతం పర్యాటక ప్యాకేజీలు రద్దయ్యాయి. మా రెగ్యులర్ పర్యటకులు సైతం ట్రిప్పులను వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన హాలీడే ట్రిప్పులను రద్దు చేశాం’ అని ట్రావెల్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి ఏపీ చైర్మన్ అబ్దుల్ మజీద్ ఫహీమ్ తెలిపారు.