రైల్వే పోలీసులతో సమన్వయ సమావేశం

దిశ, క్రైమ్‌బ్యూరో: నగరంలోని పలు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రైల్వే పోలీసులతో సీపీ అంజనీకుమార్ బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. బషీర్‌బాగ్ సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ ఇన్, అవుట్ గేటు ప్రదేశాలు, పార్కింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ముఖ్యంగా పదో నెంబర్ ప్లాట్ ఫాం వైపు పార్కింగ్, జంట నగరాల్లోని రైల్వే కాలనీలలో పెట్రోలింగ్ తదితర భద్రత అంశాలపై చర్చించారు. సమావేశంలో […]

Update: 2020-07-08 10:28 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: నగరంలోని పలు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రైల్వే పోలీసులతో సీపీ అంజనీకుమార్ బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. బషీర్‌బాగ్ సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ ఇన్, అవుట్ గేటు ప్రదేశాలు, పార్కింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ముఖ్యంగా పదో నెంబర్ ప్లాట్ ఫాం వైపు పార్కింగ్, జంట నగరాల్లోని రైల్వే కాలనీలలో పెట్రోలింగ్ తదితర భద్రత అంశాలపై చర్చించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆనంద్ భాటియా, హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఎన్. ఎస్సార్ ప్రసాద్, ఆర్పీఎఫ్ ఐజీ జీఎం ఈశ్వర్ రావు, అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్పీఎఫ్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్లు ఎస్సార్ గాంధీ, పి.శంకర్ కుట్టీ, సిటీ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి, ఈస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..