మినీ వెంటిలేటర్‌ను తయారుచేసిన హైదరాబాద్ సంస్థ..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రోజు రోజుకు కరోనా బాధితులు సంఖ్య పెరిగిపోతూనేఉంది. కరోనా బారినపడి అత్యవసర సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడంతో ఎంతో మంది మ‌ృత్యువాత పడుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ కరోనా రోగులతో పాటు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఊపయోగకరంగా ఉండేందుకు మినీ వెంటిలేటర్‌ను రూపొందించింది. ‘స్వస్థ్ వాయి ఇన్వాజివ్ వెంటిలేటర్’ అని దీనికి నామకరణం కూడా చేశారు. సూటుకేస్ సైజులో ఉండే […]

Update: 2021-05-06 01:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రోజు రోజుకు కరోనా బాధితులు సంఖ్య పెరిగిపోతూనేఉంది. కరోనా బారినపడి అత్యవసర సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడంతో ఎంతో మంది మ‌ృత్యువాత పడుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ కరోనా రోగులతో పాటు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఊపయోగకరంగా ఉండేందుకు మినీ వెంటిలేటర్‌ను రూపొందించింది.

‘స్వస్థ్ వాయి ఇన్వాజివ్ వెంటిలేటర్’ అని దీనికి నామకరణం కూడా చేశారు. సూటుకేస్ సైజులో ఉండే ఈ పరికరం 3కిలోల బరువుకన్నా తక్వువగా ఉంటుంది. ఇళ్లలో సులువుగా వాడుకోవడానికి అనుగుణంగా దీన్ని తయారు చేశారు. మొదటగా హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరంలో ఆ పరికరాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News