దాతృత్వం చాటుకున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే..
దిశ, నేరేడుచర్ల: గరిడేపల్లి మండలంలోని పోనుగోడు గ్రామానికి చెందిన కాసుల ఉపేందర్ శైలజ దంపతులకు 8 సంవత్సరాల సంతోష్ అనే కొడుకు ఉన్నాడు. చిన్న వయసులో ఆడుకుంటూ కింద పడటంతో తలకు బలమైన గాయం అయింది. దాంతో తలలో రక్తం గడ్డకట్టుకుపోయిందని అప్పటినుండి ఆ బాలుడికి ఎడమ కాలు, చెయ్యి పనిచేయకుండా ఉన్నాయని తల్లిదండ్రులు నిత్యం ఆవేదన చెందేవారు. ఆ బాలుడికి ఆపరేషన్ చేసే స్థోమతి కుటుంబానికి లేకపోవటంతో ఆపరేషన్ చేయకుండా అలాగే ఉంచారు. కార్తీక పౌర్ణమి […]
దిశ, నేరేడుచర్ల: గరిడేపల్లి మండలంలోని పోనుగోడు గ్రామానికి చెందిన కాసుల ఉపేందర్ శైలజ దంపతులకు 8 సంవత్సరాల సంతోష్ అనే కొడుకు ఉన్నాడు. చిన్న వయసులో ఆడుకుంటూ కింద పడటంతో తలకు బలమైన గాయం అయింది. దాంతో తలలో రక్తం గడ్డకట్టుకుపోయిందని అప్పటినుండి ఆ బాలుడికి ఎడమ కాలు, చెయ్యి పనిచేయకుండా ఉన్నాయని తల్లిదండ్రులు నిత్యం ఆవేదన చెందేవారు. ఆ బాలుడికి ఆపరేషన్ చేసే స్థోమతి కుటుంబానికి లేకపోవటంతో ఆపరేషన్ చేయకుండా అలాగే ఉంచారు. కార్తీక పౌర్ణమి కావడంతో నేరేడుచర్ల మండలంలోని బుర్గుల తండా శ్రీస్వయంబు సోమేశ్వర ఆలయానికి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కుటుంబంతో దర్శనానికి వచ్చారు.
ఆదే సమయంలో అక్కడికి బాలుడితో దర్శనానికి వచ్చిన తల్లి శైలజ, ఎమ్మెల్యే సైదిరెడ్డి వద్దకు ఆ బాలుడిని తీసుకువెళ్లి పరిస్థితి వివరించింది. బాలుడి పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి వెంటనే ఆ బాలుడి రిపోర్టులు తీసుకొని వస్తే డాక్టర్లతో మాట్లాడుతానని చెప్పాడు. దాంతో సాయంత్రం ఆ రిపోర్టును తీసుకువెళ్లి ఎమ్మెల్యే సైదిరెడ్డికి చూపించడంతో వెంటనే ఆయన హైదరాబాద్ పట్టణంలోని నీలోఫర్ గాంధీ సూపరిటెండెంట్ తో మాట్లాడి ఆ పిల్లవాని ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇలా ఎమ్మెల్యే స్పందించి ఆ బాలుడి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయడం పట్ల సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.