‘దళితబంధు’పై ఈటల కీలక వ్యాఖ్యలు.. ముఖ్యమంత్రిపై విమర్శలు

దిశ, తిరుమలగిరి: హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ ఊసెత్తడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలో పర్యటించిన ఈటల రాజేందర్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ అమలు చేస్తామని గొప్పలు చెప్పి, నేటి వరకు ఎక్కడా అమలు చేయలేదని విమర్శించారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని తేటతెల్లం […]

Update: 2021-12-04 09:01 GMT

దిశ, తిరుమలగిరి: హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ ఊసెత్తడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలో పర్యటించిన ఈటల రాజేందర్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ అమలు చేస్తామని గొప్పలు చెప్పి, నేటి వరకు ఎక్కడా అమలు చేయలేదని విమర్శించారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని తేటతెల్లం అయిందని స్పష్టం చేశారు. పాడి గేదెల స్కీమ్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటు చూపించారని లబ్ధిదారులు గగ్గోలు పెట్టారని, గొర్రెల కాపరులకు గొర్రెలు ఇచ్చినా అవి చాలావరకూ చనిపోయాయని చెప్పారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి రామచంద్రయ్య, జిల్లా అధికార ప్రతినిధులు వై.దీనదయల్, యాదగిరి, వెంకట్ రెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News