హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. NSUI యువనేతకు ఛాన్స్.?
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అనుబంధ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం పార్టీ తరఫున అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొండా సురేఖ పోటీకి నిరాకరించిన నేపథ్యంలో పరిణామాలు మారాయి. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే వెంకట్‌ను పోటీకి దింపేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్మాణిక్కం […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అనుబంధ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం పార్టీ తరఫున అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొండా సురేఖ పోటీకి నిరాకరించిన నేపథ్యంలో పరిణామాలు మారాయి.
అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే వెంకట్‌ను పోటీకి దింపేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.