హుజురాబాద్‌లో భారీగా పోలింగ్.. 11 గంటల వరకు ఎంతశాతం నమోదైందంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెంట వెంటనే అధికారులు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్తోన్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న సంఘటనలూ దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదటి నాలుగు గంటల్లోనే అంటే ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం […]
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెంట వెంటనే అధికారులు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్తోన్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న సంఘటనలూ దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదటి నాలుగు గంటల్లోనే అంటే ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో బైపోల్‌లో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది.