భర్త అనుమానం.. నడివీధిలో భార్యను పరిగెత్తించి మరీ..

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను తరచూ అనుమానిస్తూ చివరికి హత్య చేశాడు. నడిరోడ్డుపై అతికిరాతకంగా భార్య వెంటపడి గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. భువనగిరి మండలం పచ్చర్లబోర్డు తండాకు చెందిన పానుగోతు లచ్చుకు 14 ఏళ్ల క్రితం సునీత(34)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. ప్రారంభంలో సజావుగానే సాగిన వీరి సంసారంలో అనుమానమనే  బీజం […]

Update: 2021-06-22 03:59 GMT
husband kills his wife
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను తరచూ అనుమానిస్తూ చివరికి హత్య చేశాడు. నడిరోడ్డుపై అతికిరాతకంగా భార్య వెంటపడి గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. భువనగిరి మండలం పచ్చర్లబోర్డు తండాకు చెందిన పానుగోతు లచ్చుకు 14 ఏళ్ల క్రితం సునీత(34)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. ప్రారంభంలో సజావుగానే సాగిన వీరి సంసారంలో అనుమానమనే బీజం మొలకెత్తింది.

లారీ డ్రైవర్ గా పనిచేసే చేసే లచ్చు.. భార్యను అనుమానిస్తూ నిత్యం హింసించేవాడు. పూటుగా మద్యం తాగి తరచూ కొట్టడం చేస్తుండే వాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం భార్యభర్తల మధ్య చిన్న వివాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన లచ్చు.. భార్య వెంటపడి నడివీధిలో గొడ్డలితో నరికేశాడు. తీవ్ర గాయాలైన సునీత అక్కడికక్కడే మృతిచెందింది. భయాందోళనలు చెందిన తండా వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, నిందితుడు కాగా, తల్లి హత్యకు గురికావడంతో తండ్రి జైలుకు పోతుండడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. పోలీసులు మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News