ఆంటీ కోసం ఇంట్లోకి దూరిన యువకుడు.. వీడియోలు తీసి వైరల్ చేసిన స్థానికులు

దిశ, వెబ్ డెస్క్: తన భార్యను, ఓ యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వచ్చి భర్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోని నంజనగూడుకు చెందిన ఓ వివాహిత కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతోంది. అయితే, కూలి పనుల వద్ద ఆమెకు ఓ […]

Update: 2021-11-27 21:42 GMT
Yuvakudu
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తన భార్యను, ఓ యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వచ్చి భర్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరు జిల్లాలోని నంజనగూడుకు చెందిన ఓ వివాహిత కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతోంది. అయితే, కూలి పనుల వద్ద ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. ఆమె కోసం ఆ యువకుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు.

అయితే, ఈ విషయం భర్తకు తెలిసింది. వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. ఇటీవల ప్రియుడు ఎప్పటిలాగే ఆమె కోసం ఇంట్లోకి దూరాడు. వెంటనే భర్త తలుపులు మూసి చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. ఆ తర్వాత వారిద్దరినీ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. అక్కడి నుంచి వారిద్దరినీ తీసుకొచ్చి మూడురోజులపాటు ఇంట్లోనే బంధించి వారికి నీళ్లు, ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశాడు. ఇదంతా కూడా స్థానిక యువకులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అయితే, ఈ విషయం పోలీసులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూశారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News