ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి గందరగోళం
దిశ, వెబ్‌డెస్క్: ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ధైర్యంగా ఏ వ్యాఖ్యలు పడితే అవి చేయడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే చెల్లుతుంది. ఇక కరోనా విజృంభించిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒక నెల కిందట ఇంట్లో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే కరోనా తగ్గుతుందని చెప్పడంతో అరిజోనాలో ఓ జంట ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న డిస్ ఇన్ఫెక్ట్ తాగినా, ఇంజెక్ట్ చేసుకున్నా కరోనా బారినుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ధైర్యంగా ఏ వ్యాఖ్యలు పడితే అవి చేయడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే చెల్లుతుంది. ఇక కరోనా విజృంభించిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒక నెల కిందట ఇంట్లో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే కరోనా తగ్గుతుందని చెప్పడంతో అరిజోనాలో ఓ జంట ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న డిస్ ఇన్ఫెక్ట్ తాగినా, ఇంజెక్ట్ చేసుకున్నా కరోనా బారినుంచి బయట పడొచ్చని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల వల్ల మరోసారి గందరగోళం మొదలైంది. అయితే ప్రజలు ఎవ్వరూ ఆయన చెప్పినట్లు చేయట్లేరు కానీ చేయాలా వద్దా అని అధికారులకు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలు అన్నీ అలా చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తమ హాట్‌లైన్‌కి వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని అమెరికాలో మేరీల్యాండ్ గవర్నర్ ల్యారీ హోగన్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు సరికావని ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ప్రజలు ఇలా గుడ్డిగా నమ్మి కాల్స్ చేయడం తెలివి తక్కువతనంగా అనిపిస్తోందని ఆయన అన్నారు.
Tags:USA, President donald trump,disinfectants,hotline, government,larry hogan,Mary Land