మహిళా చిత్రాల కోసం మార్కెట్ రెడీ.. కానీ?

దిశ, సినిమా : బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి.. మహిళా ప్రధాన కథలతో రూపొందే చిత్రాలకే మార్కెట్‌లో డిమాండ్ ఉందని తెలిపింది. కానీ ఇప్పటివరకు ఫిమేల్ సెంట్రిక్‌ క్యారెక్టర్లు, స్టోరీలపై చాలా తక్కువ సినిమాలు తెరకెక్కాయని అభిప్రాయపడింది. ఈ మధ్యే ‘లీల, మహారాణి’ వంటి వెబ్ సిరీస్‌లతో హెడ్‌లైన్స్‌లో నిలిచిన హ్యూమా.. అప్‌కమింగ్ ఫిల్మ్ ‘బెల్ బాటమ్’లో అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది. ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్స్ లేదా సినిమాలోని మిగతా పాత్రలను మహిళలే నడిపించే […]

Update: 2021-08-11 06:30 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి.. మహిళా ప్రధాన కథలతో రూపొందే చిత్రాలకే మార్కెట్‌లో డిమాండ్ ఉందని తెలిపింది. కానీ ఇప్పటివరకు ఫిమేల్ సెంట్రిక్‌ క్యారెక్టర్లు, స్టోరీలపై చాలా తక్కువ సినిమాలు తెరకెక్కాయని అభిప్రాయపడింది. ఈ మధ్యే ‘లీల, మహారాణి’ వంటి వెబ్ సిరీస్‌లతో హెడ్‌లైన్స్‌లో నిలిచిన హ్యూమా.. అప్‌కమింగ్ ఫిల్మ్ ‘బెల్ బాటమ్’లో అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది.

ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్స్ లేదా సినిమాలోని మిగతా పాత్రలను మహిళలే నడిపించే బలమైన కథా నేపథ్యమున్న చిత్రాలు రావాల్సి ఉందని ఆమె అభిప్రాయపడింది. ఈ రకమైన కథల కోసం మార్కెట్ కూడా సిద్ధంగా ఉందని ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ స్టార్.. తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక తన పర్సనల్ స్టోరీ విషయానికొస్తే.. పాండమిక్‌లో ఖాళీగా ఉన్నప్పుడు రాయాలన్న ఆలోచన కలిగినట్లు తెలిపింది. నిజానికి యాక్టర్స్ అందరూ తమ స్టోరీ రాసేందుకు ఇతరులపై ఆధారపడతారని.. అయితే నా కోసం నేనెందుకు రాసుకోకూడదని అనిపించడంతో మొదలుపెట్టినట్లు చెప్పింది. కాగా ఖురేషి నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా పాండమిక్ కారణంగా వాయిదాపడటంతో ప్రస్తుతం ఈ నెల 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News