కరోనా రోగుల కోసం ఆస్పత్రి నిర్మిస్తున్న హీరోయిన్

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా పోరాడుతున్న క్రమంలో సినీ స్టార్స్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. డబ్బులు విరాళంగా ఇవ్వడం లేదా నిధుల సేకరణకు ప్రయత్నిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి, డైరెక్టర్ జాక్ స్నైడర్ కలిసి ఢిల్లీలో తాత్కాలిక ఆస్పత్రి సదుపాయాన్ని కల్పించేందుకు ముందుకొచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు 100 పడకలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కరోనా […]

Update: 2021-05-11 05:54 GMT

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్‌తో ఇండియా పోరాడుతున్న క్రమంలో సినీ స్టార్స్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. డబ్బులు విరాళంగా ఇవ్వడం లేదా నిధుల సేకరణకు ప్రయత్నిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి, డైరెక్టర్ జాక్ స్నైడర్ కలిసి ఢిల్లీలో తాత్కాలిక ఆస్పత్రి సదుపాయాన్ని కల్పించేందుకు ముందుకొచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు 100 పడకలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కరోనా రోగులు ఇంట్లోనే చికిత్స తీసుకునేందుకు వీలుగా స్పెషల్ కిట్స్ అందిస్తామన్న హ్యూమా ఖురేషి.. రోగి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు డాక్టర్, సైకోసోషల్ థెరపిస్ట్‌ కాంటాక్ట్‌లో ఉంటారని చెప్పారు. ఢిల్లీ మళ్లీ నార్మల్‌గా మారడంలో హెల్ప్ చేసేందుకు తమతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

 

Tags:    

Similar News