ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు

దిశ, రామగిరి: బీజేపీ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు నిలిపివేతకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రత్నాపూర్ లోని రైతు వేదిక నుండి సెంటినరీ కాలనీ, బేగంపేట ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అనంతరం మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు నిర్వహించిన ధర్నాకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో […]

Update: 2021-11-12 02:21 GMT

దిశ, రామగిరి: బీజేపీ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు నిలిపివేతకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రత్నాపూర్ లోని రైతు వేదిక నుండి సెంటినరీ కాలనీ, బేగంపేట ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అనంతరం మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు నిర్వహించిన ధర్నాకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజసంపత్, నాయకులు కొవ్వూరి సురేష్, సాగర్ల తిరుపతి, భాద్రపు ప్రశాంత్, సందేవేన కుమార్, రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News