ఆ డ్రైవర్‌కు మరో ఉద్యోగం ఇవ్వండి: హెచ్ఆర్సీ
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గుండెకు ఆపరేషన్ జరిగిన కారణంగా తనను ఉద్యోగానికి పనికి రావని తొలగించిన ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ డ్రైవర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ డి. ఉప్పలయ్య సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి 4జూలై 2019న కేర్ హాస్పిటల్ వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. అదే నెల […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గుండెకు ఆపరేషన్ జరిగిన కారణంగా తనను ఉద్యోగానికి పనికి రావని తొలగించిన ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఓ డ్రైవర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ డి. ఉప్పలయ్య సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి 4జూలై 2019న కేర్ హాస్పిటల్ వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. అదే నెల 12న అతన్ని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు .
ఈ సమయంలో ఆపరేషన్ చేసిన డాక్టర్ అతను డ్రైవర్ ఉద్యోగానికి అన్ ఫిట్ అని డిశ్చార్జ్ సమ్మరీలో రాశారు . దీంతో డిపో మేనేజర్ తార్నాక లోని ఆర్టీసీ ఆస్పత్రికి రాసిన లేఖలో అతను డ్రైవర్‌తో పాటు ఇతర ఏ ఉద్యోగానికి పనికి రాడని రాసి ఉద్యోగం నుండి తొలగించారు. అయితే తనకు గుండె ఆపరేషన్ జరిగినందున కేవలం డ్రైవింగ్ మాత్రమే చేయలేనని, ఇతర కార్యాలయ బాధ్యతలు అప్పగిస్తే ఏ పనైనా చేస్తానని, ఈ మేరకు తన అభ్యర్థులను పరిశీలించి తనకు ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఉప్పలయ్య హెచ్ఆర్సీని వేడుకున్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఉప్పలయ్యకు డ్రైవర్ ఉద్యోగం కాకుండా కార్యాలయంలో పని చేసేలా ఇతర ఉద్యోగం ఇవ్వాలని హెచ్ ఆర్సీ ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించింది.