ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా.. అలా చేస్తే జీరో రిజల్ట్స్..

దిశ, ఫీచర్స్ :  ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రభావమో, బిజీ షెడ్యూల్ కారణమో తెలియదు కానీ చాలామంది తమలో తాము ‘బరువు’ పెరిగిపోతున్నామని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఫిట్’గా ఉండేందుకు ప్రయత్నించేవారిలో కొందరు ఉపవాసాలు, రాత్రిళ్లు భోజనం మానేయడం వంటి పొరపాట్లు చేస్తే.. మరికొందరు వ్యాయామం వంటి కసరత్తులకు ప్రాధాన్యతనిస్తారు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. తమ ఫిట్‌నెస్ షెడ్యూల్‌ వారం రోజుల పాటు సవ్యంగా సాగినా.. ఆ తర్వాత కొనసాగించలేక చేతులెత్తేస్తారు. వ్యాయామం తప్పించుకునేందుకు […]

Update: 2021-11-29 23:37 GMT

దిశ, ఫీచర్స్ : ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రభావమో, బిజీ షెడ్యూల్ కారణమో తెలియదు కానీ చాలామంది తమలో తాము ‘బరువు’ పెరిగిపోతున్నామని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఫిట్’గా ఉండేందుకు ప్రయత్నించేవారిలో కొందరు ఉపవాసాలు, రాత్రిళ్లు భోజనం మానేయడం వంటి పొరపాట్లు చేస్తే.. మరికొందరు వ్యాయామం వంటి కసరత్తులకు ప్రాధాన్యతనిస్తారు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. తమ ఫిట్‌నెస్ షెడ్యూల్‌ వారం రోజుల పాటు సవ్యంగా సాగినా.. ఆ తర్వాత కొనసాగించలేక చేతులెత్తేస్తారు. వ్యాయామం తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే.. ‘ఎందుకు బరువు తగ్గలేకపోతున్నాను? ఫిట్‌‌నెస్ కోసం ఎందుకు కష్టపడుతున్నాను?’ అనుకోవడం సహజం. నిజానికి ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఏం చేస్తే బరువు తగ్గొచ్చు?

స్థూలకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే. అందుకే 5-10 కిలోల వరకు బరువు తగ్గితే ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ కూడా మెరుగుపడుతుందనే భావనతో.. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం. అందులో నిజమెంత? కలిగే ప్రయోజనాలేంటి? అనే విషయాలేవీ ఆలోచించం. ఉదాహరణకు : చాలామంది ‘టిఫిన్ స్కిప్ చేయడం వల్ల కొంతమేర కేలరీలను తగ్గించుకోవచ్చని అనుకుంటారు. అయితే దీనివల్ల ఆకలి మరింత పెరిగి భోజన సమయంలో ఎక్కువ తినాల్సి వస్తుంది. అంతేకాదు అల్పాహారాన్ని దాటవేయడం వల్ల స్థూలకాయం పెరుగుతుందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇందుకు పరిష్కారంగా నిద్రలేచిన గంటలోపు ఫైబర్-రిచ్, ప్రొటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేయాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక బరువు తగ్గే విషయంలో.. స్త్రీ, పురుషుల్లో తేడా ఉంటుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. స్త్రీలతో పోలిస్తే పురుషులు బరువు తగ్గడం చాలా సులభం కాగా, మహిళలు బరువు తగ్గినప్పుడు మాత్రం పురుషుల కంటే ఎక్కువ‌గా వెయిట్ లాస్ అవుతారు.

వ్యాయామం చేసేందుకు అలిసిపోయాను :

వ్యాయామం ఒక పారడాక్స్. ఇది కండరాలను శారీరకంగా అలిసిపోయేలా చేస్తుంది కానీ దాన్నుంచి మరింత శక్తిని పొందుతాం. రక్త ప్రవాహాన్ని పెంచి గుండె, మెదడు, కండరాలు సహా కణజాలాలకు ఆక్సిజన్‌ను వేగంగా పంపుతుంది. అంతేకాదు ఇది డోపమైన్, సెరోటోనిన్, నేచురల్ ఎండార్ఫిన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్స్ విడుదలను ప్రోత్సహిస్తుంది. అయితే వ్యాయామం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే అలసటగా అనిపించి, మానేయాలనిపిస్తుంటుంది. వాస్తవానికి ఇలాంటి సమయంలో వ్యాయామమే సరైన పరిష్కారం. నడక, బైకింగ్ లేదా యోగా ప్రయత్నించండి. స్నేహితుడితో కలిసి వ్యాయామం చేస్తే అలసిపోయినా కొనసాగించడానికి ప్రేరణ అందిస్తాడు.

జిమ్‌‌కు డబ్బులు ఖర్చుపెట్టలేను :

జిమ్ సభ్యత్వం కోసం డబ్బు ఖర్చు చేసేందుకు బదులుగా ఇంట్లోనే పలు వ్యాయామాలు చేయడం.. పచ్చికమైదానాలు, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో 30 నిమిషాల నడక లేదా సైక్లింగ్ వంటివి ఉత్తమం. అలాగే ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ యాప్స్‌తో పాటు యూట్యూబ్‌లో అనేక ఉచిత వ్యాయామ వీడియోలున్నాయి. మనసుంటే మార్గముంటుందని గుర్తుంచుకోండి.

సమయం లేదు లేదా ఫుల్ టైమ్ పేరెంట్‌ను :

పిల్లల పెంపకం, ఇంటి పనులు, ఆఫీస్ టైమింగ్స్, ఇతరత్రా బాధ్యతలతో 24/7 ఖాళీ దొరకడం లేదని, ఇక వ్యాయామానికి టైమ్ ఎక్కడి నుంచి కేటాయించాలని మనకు మనమే కంప్లయింట్ చేసుకుంటాం. కానీ ఆరోగ్యమే మహాభాగ్యమని అనుకుంటే.. రోజువారీ షెడ్యూల్‌లో కొంత సమయాన్ని వర్కవుట్స్ కోసం కేటాయించుకోవడం తేలికైన పనే. లంచ్ అవర్‌లో లేదా పిల్లలను స్కూల్‌లో దించిన తర్వాతైనా కొంత సమయాన్ని కేటాయించవచ్చు. రాత్రి పడుకునే ముందో లేదా టీవీ చూడటం, బ్రౌజింగ్ వంటి హాబీస్‌ను దూరంగా పెట్టి ముందుగా రోజుకు కనీసం 10 నిమిషాలతో ప్రారంభించాలి. ఆ తర్వాత వారం వారం ఆ సమయాన్ని పెంచాలి. ఆటోమేటిక్‌గా అది షెడ్యూల్‌లో భాగమైపోతుంది. పిల్లల్ని సైతం వ్యాయామంలో భాగం చేసినట్లయితే వారితో టైమ్ స్పెండ్ చేసినట్లు కూడా ఉంటుంది. ఈ క్రమంలో స్వి్మ్మింగ్‌తో పాటు పిల్లలతో ఔట్‌డోర్ గేమ్స్ ప్లాన్ చేయొచ్చు.

సరదా వ్యాయామాల వల్ల బోర్ కొట్టదని గ్రహించాలి. అయితే అవి రొటీన్ కాకుండా చూసుకోవాలి. చిన్నవైనా వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకుని మొదలుపెడితే వాటిని చేజ్ చేసినప్పుడు మరింత ఉత్సాహంతో కొత్త లక్ష్యాలను సెట్ చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలి. తప్పించుకునేందుకు మనకు ఎప్పుడూ ఓ గుడ్ ఎక్స్‌క్యూజ్ ఉండొచ్చు కానీ మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారితో పాటు క్యాన్సర్ రోగులు కూడా స్థిరమైన వ్యాయామం ద్వారా ప్రయోజనం పొందారు. అందువల్ల వర్కవుట్ చేసేందుకు సాకులు వెతక్కుండా సమయం కేటాయించుకోవడం ఉత్తమం.

Read more: అడవి తల్లికి పాటిస్తున్న పవన్ కళ్యాణ్..

Tags:    

Similar News