ఫేస్ మాస్క్ చారాలు పోవాలంటే…

దిశ వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే.. అందరూ విధిగా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. అలాగే బయట ప్రదేశాలకు వెళ్లినప్పడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలి. అనారోగ్యానికి గురైన సమయంలో అయితే .. ఇతరులు తమ కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ లు ధరించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురైన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి తుంపరలు మరొకరికి వ్యాప్తి చెందకుండా మాస్క్ అడ్డుకుంటుంది. అయితే డాక్టర్లు, నర్సులు […]

Update: 2020-04-08 07:27 GMT

దిశ వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే.. అందరూ విధిగా సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. అలాగే బయట ప్రదేశాలకు వెళ్లినప్పడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు ధరించాలి. అనారోగ్యానికి గురైన సమయంలో అయితే .. ఇతరులు తమ కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ లు ధరించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురైన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి తుంపరలు మరొకరికి వ్యాప్తి చెందకుండా మాస్క్ అడ్డుకుంటుంది. అయితే డాక్టర్లు, నర్సులు తమ విధుల్లో భాగంగా నిత్యం మాస్క్ లు ధరిస్తున్నారు. దీని వల్ల చాలామందికి ముక్కు, ముఖం మీద చారలు వస్తున్నాయి. ఈ చారలను తొలగించడానికి చర్మ ఆరోగ్య నిపుణులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు. మెడికల్ డివైజ్ లు, మాస్క్ లు మొదలైన వాటి వల్ల వచ్చే చర్మ సమస్యలపై ఓ విశ్వవిద్యాలయంలో ఒక బృందం జరిపిన పరిశోధనలను అనుసరించి ఈ వివరాలు వెల్లడించారు.

మాస్క్ లు ధరించడం వల్ల వైరస్ రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంది. కానీ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలి. అయితే విధులు నిర్వర్తించే వాళ్లు మాత్ర మాస్క్ ను ఎప్పుడూ విధిగా ధరిస్తున్నారు. అయితే మాస్క్ లు ధరించే వాళ్లు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్ పూసుకోవాలని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడానికి అర గంట ముందు బేరియర్ క్రీమ్ ను పూసుకోవాలని వారు చెబుతున్నారు. కనీసం రెండు గంటలకు ఒకసారైన మాస్క్ లు తీసి … ముఖానికి గాలి తగిలేలా చూసుకోవాలని సూచించారు. దీనివల్ల కొంతలో కొంత చారలు తగ్గే అవకాశం ఉందన్నారు.

Tags : corona virus, fase mask, rashes, infection,


Similar News