నోరూరించే చేపల వేపుడు రెసిపీ
కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు -అరకేజీ పసుపు -పావు టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్ కారం -2 టీ స్పూన్స్ ధనియాల పొడి – అర టీస్పూన్ గరం మసాలా -అర టీస్పూన్ జీలకర్ర పొడి -అర టీస్పూన్ నిమ్మకాయ రసం -2 టీస్పూన్ మొక్కజొన్న పిండి -అర టేబుల్ స్పూన్ ఉప్పు -రుచికి తగినంత నూనె -వేయించుకోవడానికి సరిపడా కొత్తిమీర -1 కట్ట కరివేపాకు -రెండు రెమ్మలు తయారు చేసే విధానం: ముందుగా […]
కావాల్సిన పదార్థాలు:
చేప ముక్కలు -అరకేజీ
పసుపు -పావు టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
కారం -2 టీ స్పూన్స్
ధనియాల పొడి – అర టీస్పూన్
గరం మసాలా -అర టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూన్
నిమ్మకాయ రసం -2 టీస్పూన్
మొక్కజొన్న పిండి -అర టేబుల్ స్పూన్
ఉప్పు -రుచికి తగినంత
నూనె -వేయించుకోవడానికి సరిపడా
కొత్తిమీర -1 కట్ట
కరివేపాకు -రెండు రెమ్మలు
తయారు చేసే విధానం:
ముందుగా చేప ముక్కలను శుభ్ర!గా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టాలి. చేప ముక్కల్లో పసుపు, నిమ్మకాయ కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని సన్నని మంటలపై గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు రెడీ..