లాక్‌డౌన్‌లో వాహనం సీజ్ చేశారా?.. మళ్లీ తెచ్చుకోవడం ఎలా?

దిశ, వెబ్‌డెస్క్: లాక్ డౌన్‌ సమయంలో అనవసర కారణాలతో రోడ్డుపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అత్యవసర, మీడియా సేవలకు మినహా మిగతా వాటికి అనుమతి లేదు. దీంతో మిగతా వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు చాలా వాహనాలను సీజ్ చేశారు. అయితే ఈ సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఎప్పుడు ఇస్తారనేది ప్రయాణికులకు అర్థం కావడం లేదు. అయితే సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ ముగిసిన […]

Update: 2021-05-23 02:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: లాక్ డౌన్‌ సమయంలో అనవసర కారణాలతో రోడ్డుపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అత్యవసర, మీడియా సేవలకు మినహా మిగతా వాటికి అనుమతి లేదు. దీంతో మిగతా వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు చాలా వాహనాలను సీజ్ చేశారు. అయితే ఈ సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఎప్పుడు ఇస్తారనేది ప్రయాణికులకు అర్థం కావడం లేదు.

అయితే సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ ముగిసిన తర్వాత కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీజ్ చేసిన వాహనాలను ఇప్పట్లో ఇవ్వడం కుదరదని చెబుతున్నారు.

Tags:    

Similar News