Personal Loan : ఆధార్ కార్డ్‌తో పర్సనల్ లోన్.. ఎలా తీసుకోవాలంటే..!
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ పౌరునికి ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. వివిధ పథకాల ప్రయోజనాలను పొందడానికి, వివిధ సేవల కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. కొంత మంది డబ్బుల కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్ డేటాను కలిగి ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ కార్డ్ ద్వారా కొన్ని రుణాలను మంజూరు చేస్తాయి. ఇది రుణదాతలకు […]
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ పౌరునికి ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. వివిధ పథకాల ప్రయోజనాలను పొందడానికి, వివిధ సేవల కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. కొంత మంది డబ్బుల కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్ డేటాను కలిగి ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ కార్డ్ ద్వారా కొన్ని రుణాలను మంజూరు చేస్తాయి. ఇది రుణదాతలకు వ్యక్తిగత ప్రామాణికతను, గుర్తింపును త్వరగా, సులభంగా ధ్రువీకరించడంలో సహాయపడుతుంది. ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయడం ద్వారా రుణం తీసుకునేవాళ్ల ఆర్థిక వివరాలు, ధ్రువీకరణ త్వరగా పూర్తవుతాయి. అందునే బ్యాంక్‌లు ఆధార్ కార్డ్ ఆధారంగా పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి.